manabharath.com
Newspaper Banner
Date of Publish : 28 January 2026, 4:15 am Editor : manabharath

నేడు ఎపీ క్యాబినెట్ మీటింగ్..

మన భారత్, తెలంగాణ:

రాష్ట్రం, దేశవ్యాప్తంగా రాజకీయ, పరిపాలన, భక్తి, క్రీడా రంగాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రయోజనాలు, పెండింగ్ అంశాలపై చర్చలు జరిగినట్లు సమాచారం.

మరోవైపు భీమవరం నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలతో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

భక్తి శ్రద్ధల మధ్య అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణం వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కల్యాణాన్ని కనులారా వీక్షించారు.

తెలంగాణలో అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం జాతర షురూ అయింది. సారలమ్మ, పగిడిద్దరాజు గద్దెలపైకి చేరడంతో జాతర వాతావరణం భక్తితో మార్మోగింది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ల దాఖలుకు సిద్ధమవుతున్నారు.

మెదక్ జిల్లాలో మీనాక్షి, మహేశ్ గౌడ్ పర్యటన కొనసాగుతోంది. అభివృద్ధి పనులు, పార్టీ కార్యక్రమాలపై స్థానిక నేతలతో చర్చలు జరిపారు.

దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించనున్న ఎన్‌సీసీ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. యువతలో దేశభక్తి, క్రమశిక్షణను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగనుంది.

క్రీడా రంగంలో వైజాగ్ వేదికగా భారత్–న్యూజిలాండ్ మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. ఉత్కంఠభరిత పోరుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.