సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడిగా నారాయణ రెడ్డి
మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల నూతన సర్పంచుల సంఘాన్ని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘ కార్యవర్గాన్ని సమ్మతితో ఎంపిక చేశారు. ఈ ఎన్నికల్లో కజ్జర్ల గ్రామానికి చెందిన సర్పంచ్ ఎల్మ నారాయణ రెడ్డిని మండల అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. తలమడుగు గ్రామానికి చెందిన ఎలుగు రాజన్నతో పాటు పూనగూడ గ్రామానికి చెందిన పెందూర్ హన్మంతులను ఉపాధ్యక్షులుగా ఎంపిక...