బీఆర్ఎస్ గూటికి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్
మన భారత్ , తెలంగాణ: వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన, ఎల్లుండి తిరిగి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన అనుచరులతో సమావేశమై బీజేపీని వీడాలనే తుది నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి ఆరూరి రమేశ్ 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అదే పార్టీ తరఫున...