వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానం: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
మన భారత్ ,తెలంగాణ: తెలంగాణ రాష్ట్రం వ్యవసాయంతో పాటు అన్ని రంగాల్లో వేగవంతమైన ప్రగతితో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో సోమవారం ఘనంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి వేడుకల్లో గవర్నర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి తదితర ప్రముఖులు...