అక్రెడిటేషన్ జర్నలిస్టులే వాహనాలపై ‘PRESS’ స్టిక్కర్ వినియోగించాలి: DPRO విష్ణువర్ధన్
మన భారత్, ఆదిలాబాద్: అక్రెడిటేషన్ కలిగిన జర్నలిస్టులు మాత్రమే తమ వాహనాలపై ‘PRESS’ అనే స్టిక్కర్ అట్టించుకోవాలని సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ ప్రియాంక ఆదేశాలు జారీ చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి (DPRO) విష్ణువర్ధన్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జర్నలిస్టులుగా అక్రెడిటేషన్ లేకుండా ఇతర వర్గాల వారు లేదా వ్యక్తులు ఇష్టారీతిన తమ వాహనాలపై ‘PRESS’ అని రాసుకోవడం చట్టవిరుద్ధమని ఆయన స్పష్టం చేశారు....