manabharath.com
Newspaper Banner
Date of Publish : 23 January 2026, 5:35 pm Editor : manabharath

తలమడుగు మండలంలో కాంగ్రెస్ బలోపేతం..

బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన కంది గంగారెడ్డి, కంది నరసింహులు

ఆదిలాబాద్ ,మన భారత్:

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఉండం గ్రామంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఉపసర్పంచ్ కంది గంగారెడ్డి మరియు బీఆర్‌ఎస్ పార్టీ యువ నాయకుడు కంది నరసింహులు బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యులు గోక గణేష్ రెడ్డి, బొల్లారం బాబన్న, మాజీ ఎంపీపీ కళ్యాణం లక్ష్మి రాజేశ్వర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ. ప్రకాష్ రావు, ఉపసర్పంచ్ రఫీక్, వార్డ్ మెంబర్లు పోతాయ్య, జగదీష్ పాల్గొని నూతనంగా పార్టీలో చేరిన నాయకులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రామ్ చందర్ దేశముఖ్, మాజీ సర్పంచ్ లక్ష్మన్న, మహేష్ యాదవ్, కె. నడిపెన్న, విల్లాస్ యాదవ్, షారఫ్ తదితరులు హాజరయ్యారు. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని నాయకులు పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి నాయకుల చేరికతో తలమడుగు మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని, రానున్న రోజుల్లో ప్రజల మద్దతుతో మరింత శక్తివంతంగా ముందుకు సాగుతామని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.