వాహనదారులు తప్పనిసరి నిబంధనలు పాటించాలి: ఏఎస్ఐ గోకుల్ జాదవ్
మన భారత్, ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేయడానికి పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. గురువారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఫైర్ స్టేషన్ సమీపంలో ఏఎస్ఐ గోకుల్ జాదవ్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు. తనిఖీల్లో భాగంగా డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు, హెల్మెట్, సీటుబెల్ట్ వంటి అంశాలను పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు....