రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి
వానాకాలం సీజన్‌కు MSP కింద కందుల కొనుగోళ్లు ప్రారంభం మన భారత్, తెలంగాణ | ఖమ్మం: రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. వానాకాలం 2025–26 సీజన్‌కు సంబంధించి కనీస మద్దతు ధర (MSP) కింద కందుల కొనుగోళ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయని ఆయన వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన మంత్రి తుమ్మల పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం...