కుమారుల మృతిని తట్టుకోలేక.. 20 రోజుల్లోనే దంపతుల ఆత్మహత్య
ఖమ్మం జిల్లా మిట్టపల్లిలో గుండెలు పిండే విషాదం మన భారత్ | తెలంగాణ ఖమ్మం జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తొమ్మిది నెలల క్రితం జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడు ప్రమాదంలో కవల కుమారులను కోల్పోయిన తల్లిదండ్రులు, ఆ మనోవేదనను తట్టుకోలేక 20 రోజుల వ్యవధిలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్‌కుమార్ (36) అలియాస్ పండు, రేవతి దంపతులు కూలీలుగా...