బీజేపీతో కలిసేది లేదు: ఎంఐఎం అధినేత ఒవైసీ స్పష్టం
మన భారత్ తెలంగాణ: మహారాష్ట్రలో బీజేపీ లేదా ఎన్డీయేతో ఎలాంటి పొత్తు ఉండదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తేల్చిచెప్పారు. తమ పార్టీ బీజేపీకి బీ టీమ్ కాదని స్పష్టం చేస్తూ, ఏ కూటమితోనూ కలిసి వెళ్లే ప్రశ్నే లేదని అకోట్లో స్పష్టమైన నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ మహారాష్ట్రలో ఎంఐఎం బలంగా ఎదిగిందని ఒవైసీ పేర్కొన్నారు. “మహారాష్ట్రలో 125 మంది కార్పొరేటర్లను మా పార్టీ టికెట్‌పై గెలిపించుకున్నాం. ఇందులో ముస్లింలతో పాటు...