1947 నుంచి కొనసాగుతున్న ఆదివాసీ సంప్రదాయం..
కేస్లాపూర్లో నాగోబా దేవత మహాపూజ.. మన భారత్ ఆదిలాబాద్ : జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామం ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. 1947 సంవత్సరం నుంచి ఆదివాసీ మెస్రం వంశీయుల ఆరాధ్య దైవమైన శ్రీ నాగోబా దేవత పుణ్యక్షేత్రంగా కేస్లాపూర్ విరాజిల్లుతోంది. తరతరాలుగా మెస్రం వంశీయులు ఈ క్షేత్రాన్ని పవిత్రంగా భావిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ తమ ఆచారాలను కాపాడుకుంటున్నారు. నాగోబా దేవతను గిరిజనుల ఆత్మీయ దైవంగా భావిస్తారు. ప్రకృతి ఆరాధన, సామూహిక ప్రార్థనలు,...