manabharath.com
Newspaper Banner
Date of Publish : 17 January 2026, 9:49 am Editor : manabharath

మున్సిపల్ ఎన్నికల్లో వార్డు వారీగా రిజర్వేషన్లు ఖరారు

ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జనరల్ మహిళా..

49 వార్డుల్లో 24 రిజర్వుడ్, 25 అనరిజర్వుడ్

మన భారత్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ మున్సిపాలిటీలో రానున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వార్డు వారీగా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మొత్తం 49 వార్డులకు గాను 24 వార్డులు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వ్ చేయగా, 25 వార్డులను అనరిజర్వుడ్‌గా ప్రకటించారు. సామాజిక న్యాయం, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే దిశగా ఈ రిజర్వేషన్లు అమలు చేసినట్లు అధికారులు తెలిపారు.

రిజర్వ్ అయిన వార్డుల్లో ఎస్టీ వర్గానికి 3 వార్డులు కేటాయించారు. వీటిలో మహిళలకు 1, సాధారణ (జనరల్)కు 2 వార్డులు ఉన్నాయి. బీసీ వర్గానికి మొత్తం 15 వార్డులు రిజర్వ్ చేయగా, అందులో మహిళలకు 7, సాధారణకు 8 వార్డులు కేటాయించారు. ఎస్సీ వర్గానికి 6 వార్డులు కేటాయించగా, వాటిలో మహిళలకు 3, సాధారణకు 3 వార్డులు ఉన్నాయి.

అనరిజర్వుడ్ కేటగిరీలో మొత్తం 25 వార్డులు ఉండగా, మహిళలకు 13, సాధారణకు 12 వార్డులు కేటాయించారు. ఈ విధంగా మహిళలకు గణనీయమైన ప్రాతినిధ్యం లభించినట్లు అధికారులు వెల్లడించారు.

వార్డు వారీగా చూస్తే, ఎస్టీ మహిళలకు 9వ వార్డు కేటాయించగా, ఎస్టీ సాధారణకు 12, 14వ వార్డులు దక్కాయి. ఎస్సీ మహిళలకు 11, 42, 1వ వార్డులు కేటాయించగా, ఎస్సీ సాధారణకు 8, 17, 18వ వార్డులు ఉన్నాయి.
బీసీ మహిళలకు 32, 38, 31, 36, 3, 7, 10వ వార్డులు కేటాయించగా, బీసీ సాధారణకు 26, 49, 20, 24, 33, 46, 43, 44వ వార్డులు ఉన్నాయి.
అనరిజర్వుడ్ మహిళలకు 16, 15, 25, 48, 39, 45, 5, 13, 35, 6, 29, 41, 37వ వార్డులు కేటాయించగా, అనరిజర్వుడ్ సాధారణకు 2, 4, 19, 21, 22, 23, 27, 28, 30, 34, 40, 47వ వార్డులు ఉన్నాయి.

ఈ రిజర్వేషన్లతో మున్సిపల్ ఎన్నికల రాజకీయ వేడి మరింత పెరిగింది. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఆశావహులు వార్డు వారీగా తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో నామినేషన్ల దశకు చేరుకోవడంతో రాజకీయ కార్యకలాపాలు ఉద్ధృతమయ్యే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.