అట్నాంగూడలో జంగో లింగో స్వాములకు అన్నదానం
మన భారత్, తాంసి : తాంసి మండలం అట్నాంగూడ గ్రామంలో జంగో లింగో స్వాముల ఆలయంలో భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తుల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. జంగో లింగో స్వాముల ఆశీస్సులతో గ్రామంలో సుఖశాంతులు నెలకొంటాయని భక్తులు ఆకాంక్షించారు. అన్నదానం మహాదానమని, ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని నిర్వాహకులు తెలిపారు....