మన భారత్, తాంసి :
తాంసి మండలం అట్నాంగూడ గ్రామంలో జంగో లింగో స్వాముల ఆలయంలో భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తుల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. జంగో లింగో స్వాముల ఆశీస్సులతో గ్రామంలో సుఖశాంతులు నెలకొంటాయని భక్తులు ఆకాంక్షించారు. అన్నదానం మహాదానమని, ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అట్నాంగూడ ఉప సర్పంచ్ ఆత్రం భరత్‌తో పాటు గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి ధార్మిక కార్యక్రమాలను కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.