ప్రాజెక్టులు పూర్తి చేయడంలో గత ప్రభుత్వం విఫలం: ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి
మన భారత్ ,తెలంగాణ: గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఒక్క చిన్న సాగునీటి ప్రాజెక్టును కూడా పూర్తిచేయలేకపోయిందని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం నిర్మల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో అనేక ప్రాజెక్టులు ప్రారంభించినట్లు ప్రచారం చేసుకున్నారని, కానీ అవి కాగితాలకే పరిమితమయ్యాయని అన్నారు. రైతులకు వాస్తవంగా ఉపయోగపడేలా సాగునీరు అందించడంలో గత ప్రభుత్వం విఫలమైందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల...