గ్రామ పంచాయతీలకు రూ.277 కోట్ల ఊతం
సంక్రాంతి కానుకగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల విడుదల మన భారత్ ,తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఆర్థిక బలం చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీలకు రూ.277 కోట్ల నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధుల విడుదలకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మంగళవారం ప్రజాభవన్‌లో ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గ్రామీణ...