రైతు భరోసాకు రూ.18 వేల కోట్లు..!
తెలంగాణ బడ్జెట్–2025: రైతులకు భారీ వరం మన భారత్, తెలంగాణ: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం రాష్ట్ర బడ్జెట్‌ను రూ.3 లక్షల కోట్లుగా ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఈసారి వ్యవసాయ రంగం, రైతులు, గ్రామీణాభివృద్ధి, పేదల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కేంద్రిత ఆలోచనతో రూపొందించిన...