మన పల్లెకు పోదాం పదా..!
💥సంక్రాంతి పండుగతో ఖాళీ అవుతున్న హైదరాబాద్.. మన భారత్ తెలంగాణ: సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. భాగ్యనగరం పల్లె బాట పడుతుంది. ఏటా కనిపించే ఈ దృశ్యం ఈ ఏడాదీ యథావిధిగా పునరావృతమవుతోంది. ఉద్యోగాలు, ఉపాధి కోసం హైదరాబాద్లో స్థిరపడిన లక్షలాది మంది నగరవాసులు స్వగ్రామాల బాట పట్టడంతో నగరం క్రమంగా ఖాళీ అవుతోంది. గడిచిన మూడు రోజుల్లోనే హైదరాబాద్ నుంచి సుమారు 30 లక్షల మందికి పైగా ప్రయాణికులు తమ స్వస్థలాలకు తరలివెళ్లినట్లు అధికారిక వర్గాలు...