మేడారంలో బస చేయనున్న సీఎం రేవంత్
మేడారంలో బస చేయనున్న సీఎం రేవంత్… జాతర పనులు 20లోపు పూర్తి మన భారత్, తెలంగాణ | ప్రత్యేక కథనం ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జాతరకు సంబంధించిన అన్ని పనులు ఈ నెల 20లోపు పూర్తవుతాయని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 19వ తేదీ రాత్రి...