ఇక కొత్త వాహనాలు కొంటే జేబుకు చిల్లు..!
తెలంగాణలో కొత్త వాహనాలపై రహదారి భద్రతా సెస్సు అమలు మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్త వాహనాల కొనుగోలుపై అదనపు భారం పడనుంది. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘రహదారి భద్రతా సెస్సు’ను ప్రవేశపెట్టింది. ఈ మేరకు మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లును రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. నూతన నిబంధనల ప్రకారం ఇకపై రిజిస్ట్రేషన్...