manabharath.com
Newspaper Banner
Date of Publish : 29 December 2025, 8:29 am Editor : Editor Vishal Kumar

కౌడాల మహేందర్ జన్మదిన వేడుకలు..

కౌడాల మహేందర్ జన్మదిన వేడుకలు.. కప్పర్లలో ప్రత్యేక పూజలు

మన భారత్, ఆదిలాబాద్: తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు కౌడాల మహేందర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రత్యేక పూజలు చేపట్టి, ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం కౌడాల మహేందర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో ఆయన మరింత ముందుకు సాగాలని, మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు.

మహేందర్ ను సన్మానించిన మాజీ మంత్రి..

తాంసి మండలంలో పార్టీ బలోపేతానికి కౌడాల మహేందర్ చేస్తున్న కృషికి మాజీ మంత్రి బీఆర్ఎస్ రథసారథి కేటీఆర్ ప్రశంసించారు. గ్రామీణ సమస్యల పరిష్కారంలో ఆయన చురుకైన పాత్ర పోషిస్తున్నారని, ప్రజల మన్ననలు పొందుతున్న నాయకుడిగా గుర్తింపు ఉందని పేర్కొన్నారు. పుట్టినరోజు సందర్భంగా శాలువాలతో సత్కరించారు.

జన్మదిన వేడుకలు ఆత్మీయ వాతావరణంలో జరిగాయని, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొన్నదని పాల్గొన్న కార్యకర్తలు తెలిపారు.