manabharath.com
Newspaper Banner
Date of Publish : 28 December 2025, 10:54 pm Editor : manabharath

బ్యాడ్మింటన్‌లో గోల్డ్ మెడల్.. అభినందించిన సీఎం

బ్యాడ్మింటన్‌లో గోల్డ్ సాధించిన చరిష్మ.. సీఎం చంద్రబాబు, లోకేశ్ అభినందనలు

మన భారత్, తెలంగాణ 

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సూర్య చరిష్మ తమిరి జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించారు. విజయవాడలో నిర్వహించిన 87వ యోనెక్స్ సన్‌రైజ్ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్–2025లో ఉమెన్స్ సింగిల్స్ విభాగంలో చరిష్మ గోల్డ్ మెడల్ గెలుచుకుని రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు.

అదేవిధంగా ఇంటర్ స్టేట్ ఇంటర్ జోనల్ బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు సిల్వర్ మెడల్ సాధించింది. జట్టు సభ్యుల సమిష్టి ప్రదర్శన క్రీడాభిమానులను ఆకట్టుకుంది.

తొలి గోల్డ్ మెడల్ సాధించిన సూర్య చరిష్మ తమిరిని, సిల్వర్ గెలిచిన ఆంధ్రప్రదేశ్ జట్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యా-ఐటీ మంత్రి నారా లోకేశ్ హృదయపూర్వకంగా అభినందించారు. క్రీడల్లో యువత సాధిస్తున్న విజయాలు రాష్ట్ర ప్రతిష్టను మరింత పెంచుతున్నాయని వారు పేర్కొన్నారు.

భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలోనూ చరిష్మ మరిన్ని విజయాలు సాధించాలని, ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని సీఎం, మంత్రి హామీ ఇచ్చారు. చరిష్మ సాధించిన ఈ విజయం రాష్ట్రంలోని యువ క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తుందని క్రీడా వర్గాలు ప్రశంసిస్తున్నాయి.