manabharath.com
Newspaper Banner
Date of Publish : 28 December 2025, 12:00 pm Editor : manabharath

‘మన్ కీ బాత్’లో పాల్గొన్న ఎంపీ గోడం నగేష్

 ఇచ్చోడ లో ‘మన్ కీ బాత్’లో పాల్గొన్న ఎంపీ గోడం నగేష్

మన భారత్, ఆదిలాబాద్: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌ. శ్రీ గోడం నగేష్  ఇచ్చోడ మండలంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ ఇచ్చోడ మండల అధ్యక్షులు రమేష్ ఇంటి వద్ద నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగాన్ని నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎంపీ గోడం నగేష్  శ్రద్ధగా వినిపించారు. దేశాభివృద్ధి, యువత పాత్ర, సామాజిక బాధ్యత, స్వావలంబన భారత దిశగా ప్రధాని ఇచ్చిన సందేశం ప్రతి ఒక్కరికి ప్రేరణనిచ్చిందని ఎంపీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ బోథ్ కన్వీనర్ బాబురావు కదం, మాజీ రైల్వే బోర్డు మెంబర్ జీ.వి. రమణ, మండల అధ్యక్షుడు టెహారే రమేష్, నాయకులు భీమ్ రెడ్డి సుభాష్ పాటిల్, పి. తులసీరాం, నరాల శ్రీనివాస్, బొండ్ల వెంకటస్వామి, అడ్వొకేట్ అంగద్ కేంద్రే, డా. గజానంద్ తదితరులు పాల్గొన్నారు.

ప్రధాని మోదీ ప్రసంగం ప్రజలతో నేరుగా సంభాషించే వేదికగా నిలుస్తోందని, దేశ పురోగతిలో ప్రతి కార్యకర్త భాగస్వామిగా మారాలని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. ‘మన్ కీ బాత్’ సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ శ్రేణులు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.