మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడంటే..!
ఒకేసారి పట్టణ స్థానిక సంస్థల పోలింగ్‌కు ప్రభుత్వం కసరత్తు మన భారత్, తెలంగాణ: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను ఫిబ్రవరి రెండో వారంలో నిర్వహించే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఫిబ్రవరిలో గడువు ముగియనున్న జీహెచ్ఎంసీతో పాటు మిగిలిన పట్టణ స్థానిక సంస్థలన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. విద్యార్థుల పరీక్షల సీజన్ ప్రారంభమయ్యేలోగానే ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లు, మహబూబ్‌నగర్, నల్గొండ...