ఎంపీని కలిసిన అర్లి (కే) సర్పంచ్ బృందం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మానందంతో మర్యాదపూర్వక భేటీ
మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ గోడం నగేష్ ని బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మానందం తో కలిసి అర్లి (కే) గ్రామ సర్పంచ్ లక్ష్మి వెంకన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి, స్థానిక సమస్యలు, మౌలిక వసతులపై చర్చించినట్లు సమాచారం.
ఈ భేటీలో జిల్లా నాయకులు కనపర్తి చంద్రకాంత్, బోండ్ల వెంకట స్వామి, రమేష్ రెడ్డి, సురేందర్ రెడ్డి, కోరండ్ల పురుషోత్తం, కాప్లయి వినోద్, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అర్లి (కే) గ్రామానికి సంబంధించిన అభివృద్ధి అవసరాలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన పరిష్కార చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో స్థానిక నాయకుల సహకారం కీలకమని తెలిపారు. అర్హమైన పనులకు పూర్తి మద్దతు అందిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మానందం కూడా పార్టీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు.