నత్త నడకన పంచాయతీ భవన పనులు..
శాశ్వత భవనం లేక రేకుల షెడ్లకే పరిమితమైన పాలన మన భారత్, తాంసి : మండలంలోని పాలోడి గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులు నత్త నడకన సాగుతుండటంతో గ్రామస్తుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. గ్రామ అభివృద్ధికి కేంద్ర బిందువుగా ఉండాల్సిన గ్రామపంచాయతీకి ఇప్పటికీ శాశ్వత భవనం లేకపోవడంతో, రేకుల షెడ్లోనే పంచాయతీ కార్యకలాపాలు నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది. సుమారు ఏడాదిన్నర క్రితం గ్రామపంచాయతీ భవన నిర్మాణాన్ని ప్రారంభించినప్పటికీ, పనులు మధ్యలోనే నిలిచిపోయాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిర్మాణ బాధ్యతలు...