manabharath.com
Newspaper Banner
Date of Publish : 26 December 2025, 2:39 am Editor : manabharath

గిరి గ్రామాల్లో చలి దుప్పట్ల పంపిణీ..

మారుమూల గిరిజన గ్రామాల్లో చలి దుప్పట్ల పంపిణీ
శ్రీ షిర్డీ సాయి సేవా సొసైటీ సేవాభావం

మన భారత్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ రూరల్ మండలంలోని మారుమూల గిరిజన గ్రామాల్లో చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని శ్రీ షిర్డీ సాయి సేవా సొసైటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో చలి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తిప్ప (K), తిప్ప (G), బోరింగ్ గూడా, హత్తిగుట్ట, చింత గూడా, నిషాన్ ఘాట్, అల్లి కోరి తదితర గ్రామాల్లో నివసిస్తున్న పేద గిరిజన కుటుంబాలకు ఈ సహాయం అందించారు.

ముఖ్యంగా వృద్ధులు, చంటి పిల్లల తల్లులను గుర్తించి సుమారు 150 చలి దుప్పట్లను పంపిణీ చేయడం విశేషం. చలికాలంలో పేద కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి సేవా భావంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీ షిర్డీ సాయి వృద్ధాశ్రమం జనరల్ సెక్రటరీ తోట శివన్న, ఆశ్రమం మేనేజర్ పసుపుల రాజు, సట్లా వెంకన్నతో పాటు ఆయా గ్రామాల సర్పంచులు చందు, భగవంత్రావ్, కిషన్ తదితరులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలను గ్రామస్థులు అభినందిస్తూ, ఇలాంటి మానవతా కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని కోరారు.

సమాజంలో బలహీన వర్గాలకు అండగా నిలవడమే లక్ష్యంగా శ్రీ షిర్డీ సాయి సేవా సొసైటీ నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుందని నిర్వాహకులు తెలిపారు.