మున్నూరు కాపు ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం
ఆదిలాబాద్ జిల్లాలో నూతన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు అభినందనలు
మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మున్నూరు కాపు ముద్దుబిడ్డలు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి ప్రజాప్రతినిధులుగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బేల గ్రామ సర్పంచ్‌గా ఓలకు భాగ్యలక్ష్మి దేవన్న, ఉమ్రి గ్రామ ఉపసర్పంచ్‌గా కన్నె ఈరన్న, లేఖర్‌వాడ గ్రామ సర్పంచ్‌గా సంద ప్రభాకర్, ఉపసర్పంచ్‌గా మారిశెట్టి దేవన్న, బాలాపూర్ గ్రామ ఉపసర్పంచ్‌గా చిన్న గజా నన్‌లను ఘనంగా అభినందించారు.
మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ అధ్యక్షులు తోట శివన్న, ప్రధాన కార్యదర్శి బొల్లు ఈశ్వర్ దాస్, సభ్యులు వద్ది రవికాంత్‌తో పాటు మున్నూరు కాపు కుల బంధువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన ప్రజాప్రతినిధులకు మిఠాయిలు తినిపించి, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, గ్రామాభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు అంకితభావంతో పనిచేయాలని, మున్నూరు కాపు సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలుపుతూ, గ్రామాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.