manabharath.com
Newspaper Banner
Date of Publish : 23 December 2025, 2:03 pm Editor : Editor Vishal Kumar

ఉండం సర్పంచ్ ను సన్మానించిన మాజీ జడ్పీటీసీ రాజు

ఉండం సర్పంచ్ బోండ్ల మహేందర్‌కు ఘన సత్కారం

మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని ఉండం గ్రామ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన బోండ్ల మహేందర్‌ను తాంసి మాజీ జడ్పీటీసీ బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు తాటిపెల్లి రాజు (గంగాధర్ రావు) శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా తాటిపెల్లి రాజు మాట్లాడుతూ గ్రామాభివృద్ధి దిశగా బోండ్ల మహేందర్ సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శక పాలన అందించాలని సూచించారు.

సర్పంచ్ బోండ్ల మహేందర్ మాట్లాడుతూ తనను సత్కరించిన నాయకులకు, పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధే తన లక్ష్యమని, అన్ని వర్గాల ప్రజల సహకారంతో ఉండం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమం ముగింపులో నాయకులు, గ్రామస్తులు నూతన సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

సత్కార కార్యక్రమంలో నాయకులు బోండ్ల మధుకర్‌తో పాటు ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు.