మర్రి చెట్టు నీడలో ప్రమాణ స్వీకారం..
మర్రి చెట్టు నీడలో ప్రజాస్వామ్య ప్రమాణం.. సకినాపూర్ సర్పంచ్‌గా నికిత నగేష్ ప్రమాణ స్వీకారం మన భారత్, ఆదిలాబాద్: తలమడుగు మండలంలోని సకినాపూర్ గ్రామంలో ప్రత్యేక వాతావరణంలో ప్రజాస్వామ్య పండుగను గ్రామస్తులు వీక్షించారు. గ్రామానికి ఆనవాయితీగా నిలిచిన మర్రి చెట్టు నీడలో నూతన సర్పంచ్‌గా మేస్త్రం నికిత నగేష్, వార్డ్ సభ్యులతో కలిసి అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. సాదాసీదా వాతావరణంలో, గ్రామీణ సంప్రదాయాలకు అద్దం పడుతూ జరిగిన ఈ కార్యక్రమం స్థానికుల్లో విశేష ఆకర్షణగా నిలిచింది....