ఆన్లైన్లో ఫుడ్, నిత్యావసరాల కొనుగోలు చేస్తే తస్మాత్ జాగ్రత్త.!
మన భారత్, హైదరాబాద్: ఆన్లైన్లో ఫుడ్, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. ప్రముఖ ఆన్లైన్ డెలివరీ సంస్థల గోదాములు, డార్క్ స్టోర్లలో నిర్వహించిన తనిఖీల్లో తీవ్ర లోపాలు వెలుగులోకి వచ్చాయి. కుళ్లిన కూరగాయలు, పాడైపోయిన ప్రూట్స్, ఎక్స్పెరీ డేట్ అయిపోయిన ఆహారపదార్థాలు నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. బ్లింకిట్, బిగ్ బాస్కెట్, జెప్టో, స్విగ్గీ, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందాలు ఆకస్మిక...