పల్లి (బి) సర్పంచ్ కటకం సంజీవ్‌కు ఘన సన్మానం
మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని పల్లి (బి) గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్‌గా ఎన్నికైన కటకం సంజీవ్ ,వార్డ్ సభ్యులు ప్రణిత శ్రీకాంత్ ను నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాతో సత్కరించారు.
సర్పంచ్ కటకం సంజీవ్ మాట్లాడుతూ… తనపై విశ్వాసం ఉంచి అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని, మౌలిక సదుపాయాల మెరుగుదల, తాగునీరు, పారిశుధ్యం, రోడ్లు, విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
గ్రామ ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్న ఆయన… ప్రతి వర్గాన్ని కలుపుకొని ముందుకు సాగుతానన్నారు. ఈ కార్యక్రమంలో మాల్కు, సోమన్న, శ్రీనివాస్ , విఠ్ఠల్, లింగారెడ్డి , ధశరథ్, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.