manabharath.com
Newspaper Banner
Date of Publish : 18 December 2025, 12:21 pm Editor : manabharath

పల్సి తాండ సర్పంచ్ గా రాథోడ్ ఆర్తి ప్రభు..

పల్సి(తాండ) గ్రామపంచాయతీ సర్పంచ్‌గా రాథోడ్ ఆర్తి ప్రభు ఏకగ్రీవ ఎన్నిక

మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని పల్సి(తాండ) గ్రామపంచాయతీ సర్పంచ్‌గా రాథోడ్ ఆర్తి ప్రభును గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగియగా, ఏకగ్రీవ ఫలితంతో గ్రామంలో ఆనందోత్సాహాలు వెల్లివరించాయి.

ఈ సందర్భంగా నూతన సర్పంచ్ రాథోడ్ ఆర్తి ప్రభు మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, మౌలిక వసతుల మెరుగుదలతో పాటు పరిశుభ్రత, తాగునీటి సరఫరా, విద్యా మరియు ఆరోగ్య సదుపాయాల బలోపేతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు.

అలాగే గ్రామస్తుల సహకారంతో పారదర్శక పాలన అందిస్తూ, అందరికీ సమాన న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు.

ఏకగ్రీవ ఎన్నికను గ్రామంలోని పెద్దలు, యువత, మహిళలు స్వాగతించారు. గ్రామాభివృద్ధి దిశగా అందరూ కలిసి ముందుకు సాగుతామని వారు తెలిపారు. ఈ ఏకగ్రీవ ఎన్నికతో గ్రామంలో ఐక్యత మరింత బలపడిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.