manabharath.com
Newspaper Banner
Date of Publish : 11 December 2025, 3:05 pm Editor : manabharath

తల్లిపై కూతురి గెలుపు..

💥 తల్లిపై కూతురి గెలుపు… తిమ్మయ్యపల్లిలో సర్పంచ్ ఎన్నికలలో సంచలన ఫలితం!

మన భారత్, తెలంగాణ: తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వెలుగులోకి వస్తున్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లిలో తల్లి–కూతురు మధ్య జరిగిన సర్పంచ్ పోరు చర్చనీయాంశమైంది. తల్లి గంగవ్వకు ప్రత్యర్థిగా పోటీ చేసిన కూతురు పల్లెపు సుమ హోరాహోరీ పోరులో 91 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు.

ఇద్దరి మధ్య నెలకొన్న కుటుంబ విభేదాలు ఈ ఎన్నికల్లో మరింత స్పష్టమయ్యాయి. గ్రామానికే చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో సుమ–గంగవ్వ కుటుంబాల్లో తొలినాళ్ల నుంచే విభేదాలు కొనసాగుతుండగా, ఈ ఎన్నిక ఆ విభేదాలకు రాజకీయ రంగు పోశింది.

గ్రామస్తులు ఉత్కంఠతో ఎదురుచూసిన ఈ పోరులో కూతురు సుమ గెలవడంతో గ్రామంలో రాజకీయ వాతావరణం మరోసారి కదిలిపోయింది. కుటుంబ కలహాలపై ప్రజాస్వామ్య తీర్పు ఎంత స్పష్టంగా ఇస్తుందో ఈ ఎన్నికలు చూపించాయని స్థానికులు అభిప్రాయపడ్డారు.