manabharath.com
Newspaper Banner
Date of Publish : 11 December 2025, 2:52 pm Editor : manabharath

లక్కీ డ్రాతో సర్పంచ్ ఎన్నిక.!

🎯 ఇచ్చోడ దాబా(బి) గ్రామంలో లక్కీ డ్రాతో సర్పంచ్ ఎన్నిక!

మన భారత్, ఆదిలాబాద్: ఇచ్చోడ మండలం దాబా(బి) గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలు శాంతియుతంగా ముగిశాయి. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులకు 176 ఓట్లు చొప్పున రావడంతో అధికారులు గందరగోళానికి గురయ్యారు.

ఎన్నికల నిబంధనల ప్రకారం సమాన ఓట్లు వచ్చినప్పుడు డ్రా పద్ధతి అనుసరించాల్సి రావడంతో, అధికారులు గ్రామ పెద్దల సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించారు. చివరికి అదృష్టం కలిసి రావడంతో ఈశ్వరును సర్పంచ్‌గా ప్రకటించారు.

లక్కీ డ్రా ద్వారా నేతను ఎన్నుకోవడం గ్రామంలో పాటు మండలవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాధాన్యతను మరోసారి గుర్తు చేసిన సంఘటనగా గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.