manabharath.com
Newspaper Banner
Date of Publish : 11 December 2025, 1:34 pm Editor : manabharath

ఇంట్లో ఆడుతూ టూత్పేస్ట్ తిని.. పిల్లాడు మృతి

😢 టూత్‌పేస్ట్ విషంగా మారింది… ఆడుకుంటూ మింగిన శిశువు మృతి

మన భారత్, ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇగ్లాస్ ప్రాంతం కరాస్ గ్రామానికి చెందిన ఆరు నెలల హసన్ ఇంట్లో ఆడుకుంటూ పొగాకు మిశ్రమం కలిగిన టూత్‌పేస్ట్‌ను నోట్లో పెట్టుకుని మింగేశాడు. కొద్దిసేపటికే వాంతులు, అస్వస్థత మొదలవడంతో తల్లి వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించింది. అయితే అప్పటికే బిడ్డ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

పొగాకు ఆధారిత టూత్‌పేస్ట్‌లు పిల్లలకు అత్యంత ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి గుండె, ఊపిరితిత్తులు, పేగులు, మెదడు వంటి ముఖ్య అవయవాలపై తీవ్ర విష ప్రభావం చూపుతాయని చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ సూర్యప్రకాశ్ స్పష్టం చేశారు. ఇలాంటి ఉత్పత్తులను పిల్లలకు అందుబాటులో లేకుండా ఉంచాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.