manabharath.com
Newspaper Banner
Date of Publish : 11 December 2025, 12:57 pm Editor : manabharath

రత్నాపూర్ సర్పంచ్‌గా సులోచన నరేష్ ఏకగ్రీవం..

✍️ రత్నాపూర్ సర్పంచ్‌గా సులోచన నరేష్ కుమార్ ఏకగ్రీవం

మన భారత్, ఆదిలాబాద్: తలమడుగు మండలంలోని రత్నాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఒకటే నామినేషన్ దాఖలు కావడంతో సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ పదవికి ఆత్రం సులోచన నరేష్ కుమార్‌ను గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ఉప సర్పంచ్‌ గా కోవ మున్నాబాయిని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.

గ్రామ అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రాథమిక సదుపాయాల మెరుగుదల కోసం కృషి చేయాలని తమ బాధ్యతను స్వీకరించిన వెంటనే నాయకులు స్పష్టం చేశారు. గ్రామంలో రోడ్లు, శుద్ధి నీరు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి విభాగాల్లో త్వరితగతిన పనులు చేపట్టనున్నట్లు వారు తెలిపారు.

పటేల్ మేస్రం నాగోరావ్ , మహాజన్ పెందూర్ ప్రసాద్, ఆత్రం కోసేరావ్,కుమ్ర తెలంగా రావు లతో పాటు స్థానిక ప్రజలు కూడా కొత్త నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ గ్రామాభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.