పోలింగ్ కేంద్రాల్లో భద్రత – ఎస్సై జీవన్ రెడ్డి సూచనలు
మన భారత్, ఆదిలాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద శాంతి భద్రతలు కట్టుదిట్టం చేసినట్లు తాంసి ఎస్సై జీవన్ రెడ్డి ప్రకటించారు. మండలంలోని ప్రతి గ్రామంలో ప్రజలు తప్పనిసరిగా పోలీసుల సూచనలు పాటించాలని, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించడం అత్యంత కీలకమని తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్ఐ జీవన్ రెడ్డి మాట్లాడుతూ..
* ఓటర్లు భయపడకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని,
* పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉండడంతో ఎవరూ గుంపులు గుంపులుగా చేరవద్దని సుచన
* కేంద్రం నుంచి 100 మీటర్ల దూరం, 200 మీటర్ల పరిధిలో ప్రత్యేక నిబంధనలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.
ఎన్నికల రోజున శాంతిభద్రతల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజల సహకారం ఉంటే ఎన్నికలు ఎటువంటి అంతరాయం లేకుండా పూర్తవుతాయని ఎస్ఐ అభిప్రాయపడ్డారు.