తలమడుగు అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని సీఎం కు వినతి పత్రం అందజేసిన మాజీ జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి
మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన అధికారిక కార్యక్రమాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్శన సందర్భంగా తలమడుగు మండల మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి ముఖ్యమంత్రిని కలిసి మండల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
తలమడుగు మండలంలో రహదారులు, త్రాగునీటి సదుపాయం, వ్యవసాయ మౌలిక వసతులు, యువతకు ఉపాధి అవకాశాల కల్పన తదితర కీలక రంగాల్లో అభివృద్ధి ఆగిపోయిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యాయని, అదే స్థాయిలో తలమడుగు మండలానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని గణేష్ రెడ్డి డిమాండ్ చేశారు.
ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలను ప్రభుత్వం సానుకూలంగా పరిగణిస్తుందని, తగిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు మాజీ జడ్పిటిసి తెలిపారు. స్థానిక ప్రజలు అభివృద్ధిపై ఆశలు పెట్టుకుని ఉన్న ఈ సమయంలో గోక గణేష్ రెడ్డి చేసిన విజ్ఞప్తి చర్చనీయాంశంగా మారింది.