manabharath.com
Newspaper Banner
Date of Publish : 08 December 2025, 3:36 am Editor : manabharath

అల్లూరి జిల్లాలో చలి రెచ్చిపోతోంది..

అల్లూరి జిల్లాలో చలి రెచ్చిపోతోంది..
జి.మాడుగులలో 5.3°C… ఉత్తర కోస్తా–ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి

మన భారత్, ఏపీ డెస్క్: రాష్ట్రాన్ని చలి పట్టిపీడిస్తోంది. ఉదయం పూట తీవ్రమైన చలితో ప్రజలు ఇళ్లలోనే వణుకుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున అల్లూరి సీతారామరాజు జిల్లా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. జి.మాడుగుల మండలంలో కనిష్ఠంగా 5.3 డిగ్రీల సెల్సియస్ నమోదై ఈ సీజన్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతగా వాతావరణ శాఖ నమోదు చేసింది.

ఇదిలా ఉంటే, ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా చలి దంచికొడుతోంది.

  • ముంచంగిపట్టు – 7.7°C
  • డుంబ్రిగూడ – 8.2°C
  • అరకు – 8.9°C
  • చింతపల్లి – 9.5°C
  • హుకుంపేట – 9.6°C

ఆంధ్రా పర్వత ప్రాంతాలతో పాటు తెలంగాణలోని కొండచరియల ప్రాంతాలు కూడా తక్కువ ఉష్ణోగ్రతలను నమోదు చేశాయి. HYDలోని HCU వద్ద 9°C, BHELలో 10.6°C నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

వాతావరణ శాఖ ప్రకారం, ఈశాన్య గాలుల ప్రభావంతో రాబోయే కొన్ని రోజులు తెల్లవారుజామున చలి మరింత పెరగనున్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. పర్వత ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.