manabharath.com
Newspaper Banner
Date of Publish : 08 December 2025, 1:57 am Editor : manabharath

900 కొత్త నియామకాలు షురూ..

💥సంక్షోభం నుంచి బయటపడేందుకు ఇండిగో భారీ ఎత్తున తీసుకోనున్న పైలట్లు 900 కొత్త నియామకాలు

మన భారత్, హైదరాబాద్: దేశంలో అతి పెద్ద విమానయాన సంస్థలలో ఒకటైన ఇండిగో, కార్యకలాపాల విస్తరణతో పాటు సిబ్బంది కొరతను అధిగమించేందుకు భారీగా పైలట్లను నియమించుకునే ప్రణాళిక రూపొందించింది. సంస్థ మొత్తం 900 మంది పైలట్లను అదనంగా తీసుకోనున్నట్టు ప్రభుత్వానికి తెలియజేసిందని జాతీయ మీడియా పేర్కొంది.

విమాన రంగ సంక్షోభానికి ఇండిగో సమాధానం – భారీ రిక్రూట్‌మెంట్‌

గత కొన్నాళ్లుగా పలు విమానాల రద్దు, సిబ్బంది కొరత, ఆపరేషనల్ ఇబ్బందులు ఏర్పడిన నేపథ్యంలో, విమాన సర్వీసులను మరింత బలోపేతం చేసేందుకు ఇండిగో పెద్ద ఎత్తున పైలట్ల నియామకంపై దృష్టిసారించింది.

2026 నాటికి భారీ రిక్రూట్‌మెంట్ లక్ష్యం

జాతీయ మీడియా నివేదికల ప్రకారం:

  • ఫిబ్రవరి 2026 నాటికి 108 నుండి 158 పైలట్లు,
  • డిసెంబర్ 2026 నాటికి 742 పైలట్లు
    తీసుకోనున్నట్టు ఇండిగో ప్రభుత్వానికి తెలిపిందని సమాచారం.

ప్రస్తుతం కొనసాగుతున్న శిక్షణ & ప్రమోషన్లు

  • ఇప్పటికే 250 మంది జూనియర్ ఫస్ట్ ఆఫీసర్లకు శిక్షణ ఇస్తోంది.
  • అదనంగా 300 మంది కెప్టెన్లు, 600 మంది ఫస్ట్ ఆఫీసర్లను నియమించటం లేదా అప్గ్రేడ్ చేసే ప్రక్రియను సంస్థ ప్రారంభించింది.

ప్రస్తుతం ఇండిగో వద్ద మొత్తం 5,456 మంది పైలట్లు ఉన్నారు. ఈ కొత్త నియామకాలతో ఇండిగో నెట్‌వర్క్‌ మరింత బలపడనుంది. విమాన ప్రయాణ డిమాండ్ పెరుగుతున్న ఈ కాలంలో, కొత్త రూట్లు మరియు మరిన్ని విమానాల ఆపరేషన్లను నిర్వహించేందుకు ఈ నియామకాలు కీలకమవనున్నాయి.