manabharath.com
Newspaper Banner
Date of Publish : 07 December 2025, 11:12 pm Editor : manabharath

పాముకు CPR చేసి ప్రాణాలు కాపాడిన యువకుడు.!

🐍✒️ పాముకు CPR చేసి ప్రాణాలు కాపాడిన యువకుడు.!

గుజరాత్ వల్సాడ్‌లో అరుదైన ఘటన

మన భారత్, గుజరాత్: గుజరాత్‌ లోని వల్సాడ్ జిల్లాలో అద్భుతమైన, అరుదైన, మానవతను చూపించే ఘటన చోటుచేసుకుంది. ప్రాణాలకు తెగించి ఓ అత్యంత విషపూరిత పాముకు ప్రాణదానం చేసిన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

🔹 రస్సెల్ వైపర్‌కు CPR… ప్రాణాలు నిలుపిన అలీ అన్సారీ

ఆసియా ఖండంలో రెండో అత్యంత విషపూరితమైన రస్సెల్ వైపర్ పామును కాపాడేందుకు స్థానిక యువకుడు అలీ అన్సారీ హృదయపూర్వకంగా ప్రయత్నించారు.

వల్సాడ్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్ ప్రాంగణంలో రెండు పాములు కనిపించడంతో హడావిడి చెలరేగింది. రెస్క్యూ సమయంలో మొదటి పామును సురక్షితంగా పట్టుకున్నారు.

అయితే రెండో పాము భయంతో అక్కడి వారు కర్రలు, రాళ్లు విసరడంతో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.

🔹 స్ట్రా సాయంతో శ్వాస ఇచ్చిన హీరో

స్థితి విషమించడంతో అలీ వెంటనే స్పందించి, తనతో ఉన్న స్ట్రా సాయంతో ఆ పాముకు CPR (cardiopulmonary resuscitation) ఇచ్చారు.

కొద్ది నిమిషాల పాటు శ్వాస నింపడంతో పాము మళ్లీ కదలికలు చూపించగా, అనంతరం దానిని అడవిలో సురక్షితంగా వదిలేశారు.

🔹ప్రశంసల వర్షం

ఓ అత్యంత ప్రమాదకరమైన పాముకు కూడా అలీ చూపిన కరుణ, ధైర్యసాహసం స్థానికులను, సోషల్‌ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంది.

“మానవత్వానికి జాతిలు లేవని నిరూపించాడు”, “వన్యప్రాణి సంరక్షణకు నిజమైన ఉదాహరణ” అంటూ పలువురు ప్రశంసిస్తున్నారు.