💥 TVK సభకు పోలీసుల ఆంక్షలు – 5 వేల మందికే అనుమతి.!
మన భారత్, పుదుచ్చేరి: పుదుచ్చేరిలో రేపు జరుగనున్న TVK పార్టీ చీఫ్ విజయ్ సభపై పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. భారీ జనసందోహం, భద్రతా కారణాల దృష్ట్యా కేవలం 5 వేల మందికే ప్రవేశం కల్పించనున్నట్లు స్పష్టంగా ప్రకటించారు.
🔹 QR కోడ్ పాస్ ఉన్నవారికే ఎంట్రీ
TVK జారీ చేసిన QR కోడ్ పాసులు కలిగిన స్థానికులకే సభలో ప్రవేశం ఇస్తామన్న పోలీసులు,
అనుమతి లేని ఎవరూ సభ ప్రాంగణంలోకి రానీయబోమని చెప్పారు.
🔹 పిల్లలు, గర్భిణీలు, వృద్ధులకు నో ఎంట్ర
భద్రతా కారణాల వల్ల—
* పిల్లలు
* గర్భిణీలు
* వృద్ధులు
ఈ సభకు హాజరు కావద్దని పోలీసులు స్పష్టంగా నిరోధం విధించారు.
🔹 తప్పనిసరిగా ఉండాల్సిన ఏర్పాట్లు
సభ నిర్వహణ కమిటీకి పోలీసులు ఇచ్చిన ఆదేశాలు:
* తాగునీటి సౌకర్యం
* మరుగుదొడ్లు
* అంబులెన్స్‌లు
* ఎమర్జెన్సీ ఎగ్జిట్లు
స్టేజ్ మరియు ప్రేక్షకుల ప్రాంతాల్లో సేఫ్టీ మార్గదర్శకాలు
🔹 కరూర్ ఘటన మళ్లీ జరగకుండా జాగ్రత్తలు
ఇటీవల కరూర్లో జరిగిన ప్రమాదం నేపథ్యంలో,ఏ తప్పిదం జరగకుండా పోలీసులు అదనపు భద్రతా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.జనాల రాకపోకలపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉంటుంది.
ఈ నేపథ్యంలో TVK అనుచరులు, విజయ్ అభిమానులు సభ నియమాలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.