manabharath.com
Newspaper Banner
Date of Publish : 07 December 2025, 9:11 pm Editor : manabharath

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత నిరసన ..

💥భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత నిరసన – విద్యార్థి ఇంటి ముందు ఉపాధ్యాయులు, పిల్లల ధర్నా

మన భారత్ | Bhadrachalam News | School Protest

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో విద్యా వ్యవస్థలో అరుదైన, హృద్యమైన నిరసన ఘటన చోటుచేసుకుంది. దుమ్ముగూడెం మండలం నిమ్మలగూడెం గ్రామ ప్రాథమిక పాఠశాలకు వారం రోజులుగా రాకుండా ఉన్న 4వ తరగతి విద్యార్థిని తిరిగి చదువులోకి తీసుకురావడం కోసం ఉపాధ్యాయులు ప్రత్యేకమైన పద్ధతిలో నిరసన చేశారు.

🔴 వారం రోజులుగా స్కూల్‌కు రాని విద్యార్థి – తల్లిదండ్రుల మౌనం

ప్రాథమిక పాఠశాల నాలుగో తరగతి విద్యార్థి గత వారం రోజులుగా స్కూల్‌కు రావడం లేదని గుర్తించిన ఉపాధ్యాయులు పలుమార్లు ఇంటికి వెళ్లి కారణం అడిగినా…

తల్లిదండ్రులు ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో పరిస్థితి మరింత అనుమానాస్పదంగా మారింది.

🔴 విద్యార్థి ఇంటి ముందే బైఠాయించిన ఉపాధ్యాయులు, తోటి పిల్లలు

ఇదే నేపథ్యంలో—

ఉపాధ్యాయులు ,తోటి విద్యార్థులు అందరూ కలిసి బాలుడి ఇంటి ముందే బైఠాయించి, శాంతియుత నిరసనకు దిగారు.

“పిల్లల భవిష్యత్తు చెడకూడదు… స్కూల్‌కి క్రమంగా రావాలి” అనే సందేశంతో ఈ వినూత్న ధర్నా ప్రజల దృష్టిని ఆకర్షించింది.

🔴 తల్లిదండ్రులు – సోమవారం నుంచి స్కూల్‌కు పంపుతామని హామీ

ఈ విచిత్ర నిరసనను గమనించిన తల్లిదండ్రులు చివరికి స్పందించి—

“సోమవారం నుంచి మా బాబును తప్పకుండా స్కూల్‌కు పంపిస్తాం” అని ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు.

గ్రామంలో ఈ ఘటన పెద్ద చర్చనీయాంశమయ్యింది. ఉపాధ్యాయుల ఈ సామాజిక స్పృహకు పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.