మహాత్మా జ్యోతిబాపులే బీసీ గురుకుల డిగ్రీ మహిళా కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
మన భారత్, ఆదిలాబాద్: మావల సమీపంలోని మహాత్మా జ్యోతిబాపులే బీసీ గురుకుల డిగ్రీ మహిళా కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పి. గోపాలకిషన్ ప్రకటించారు. ఎకనామిక్స్, కామర్స్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయని ఆయన తెలిపారు.
పీజీ అర్హతతో పాటు నెట్, సెట్ లేదా పీహెచ్‌డీ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వివరించారు. దరఖాస్తుదారులు ఈ నెల 8వ తేదీ ఉదయం 10 గంటలకు నేరుగా కళాశాలలో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు. ఇంటర్వ్యూకు సంబంధించిన వివరాల కోసం 8897802060, 9441584805 నంబర్లను సంప్రదించాలని సూచించారు.