ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు: సీఎం రేవంత్ రెడ్డి
మన భారత్, తెలంగాణ: హనుమాన్ గుడిలేని ఊరు ఉండొచ్చు కానీ ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు రాష్ట్రంలో ఎక్కడా లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిన భారీ సభలో మాట్లాడిన ఆయన, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
గత ప్రభుత్వ రుణమాఫీ కేవలం వడ్డీలకే సరిపోయిందని పేర్కొన్న సీఎం, తమ ప్రభుత్వం ఒకేసారి ₹20,614 కోట్ల రుణాలను మాఫీ చేసి రైతులకు పెద్ద ఊరట కల్పించిందని చెప్పారు. “KCR పాలనలో పదేళ్ల పాటు రేషన్ కార్డులు ఇవ్వలేదు. కానీ మేము లక్షలాది కుటుంబాలకు రేషన్ కార్డులు జారీ చేశాం. 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నాం. పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగుతున్నాయి” అని రేవంత్ అన్నారు.
ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ‘ఇందిరమ్మ ఇల్లు’ పథకం లబ్ధిదారులు లేకుండా ఒక్క ఊరూ ఉండదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.