సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రికి రామన్న, ఎమ్మెల్యే అనిల్ జాదవ్
మన భారత్, తాంసి(తలమడుగు), డిసెంబర్ 4:
యువత భక్తి, సేవాభావంతో ముందుకు సాగాలని మాజీ మంత్రి జోగు రామన్న , బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పిలుపునిచ్చారు. తలమడుగు మండలంలోని సాయిలింగి గ్రామ సాయిబాబా ఆలయంలో జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారు ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, “దేవుడు అందరికి ఒక్కడే… సబ్ కా మాలిక్ ఎక్ హై అని సాయిబాబా సందేశం చెప్పారు. సమాజం శాంతి, సౌభ్రాతృతో ముందుకు సాగాలంటే యువత ఆద్యాత్మిక మార్గం వైపు అడుగులు వేయాలి” అని అన్నారు.
కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, సామాజిక కార్యకర్త దెబ్బడి అశోక్, బీఆర్ఎస్ నాయకులు కేమ శ్రీకాంత్, కిషన్, గ్రామస్తులు పొచ్చన్న, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.