💥త్వరలో మరో 40 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ – సీఎం రేవంత్ హామీ
మన భారత్, హైదరాబాద్: తెలంగాణలో భారీ నియామకాల దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. పదేళ్ల పాలనకు ప్రజలు చరమగీతం పాడిన రోజు ఇదేనని, అదే రోజు ఉద్యమ వీరుడు శ్రీకాంతాచారి బలిదానం గుర్తు చేసుకుంటూ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి హుస్నాబాద్ సభలో కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే 60 వేల ఖాళీలను భర్తీ చేసిన ప్రభుత్వం, త్వరలో మరిన్ని 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి సన్నాహాలు ప్రారంభించినట్లు వెల్లడించారు.
రెండున్నరేళ్లలో మొత్తం లక్ష ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. 2001లో ఉద్యమం ఈ ప్రాంతం నుంచే అగ్నిజ్వాలలా ప్రారంభమై, 2004లో కరీంనగర్ సభలో సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు ప్రత్యేక రాష్ట్ర హామీ ఇచ్చిన సంగతి గుర్తుచేశారు.
రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉద్యోగావకాశాల కల్పన తమ ప్రభుత్వ ప్రాధాన్యమని సీఎం స్పష్టం చేశారు. త్వరలోనే కొత్త నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.