manabharath.com
Newspaper Banner
Date of Publish : 02 December 2025, 4:11 pm Editor : manabharath

అర్ధరాత్రి మద్యం మత్తులో యువతి హల్చల్.!

అర్ధరాత్రి మద్యం మత్తులో యువతి హల్చల్ – షాపూర్ నగర్‌లో రోడ్డుపై వీరంగం

మన భారత్ , హైదరాబాద్: నగరంలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్‌లో అర్ధరాత్రి ఓ యువతి మద్యం మత్తులో రోడ్డుపై హల్చల్ చేసి హావభావాలతో, అరుపులతో ప్రయాణికులను, పోలీసులు వరకు ఇబ్బందులకు గురిచేసిన ఘటన సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

సమాచారం ప్రకారం..
షాపూర్ నగర్ చౌరస్తాలో ఓ యువతి మద్యం మత్తులో రోడ్డు మధ్యలో నిలబడి వాహనదారులను అడ్డుకుంటూ, కేకలు వేస్తూ ఆగ్రహంగా ప్రవర్తించింది. ఆమె అకస్మాత్తుగా వాహనాల ముందు వచ్చి డ్రైవర్లను భయపెట్టడంతో అక్కడ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కొద్దిసేపు ఆమె ప్రవర్తనతో స్థానికులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ మత్తులో ఉన్న ఆ యువతి వారికి కూడా విఘాతం కలిగించినట్లు తెలుస్తోంది. పోలీసుల వాహనాన్ని కూడా అడ్డుకుని కేకలు వేయడంతో అక్కడ అప్పటికప్పుడు ఉద్రిక్తత నెలకొంది.

చివరికి 108 అంబులెన్స్ సాయంతో పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆ యువతిని రోడా మేస్త్రి నగర్‌కు చెందిన “ఇందు”గా గుర్తించారు. తీవ్ర మత్తులో ఆమె ఈ స్థాయి హల్చల్ చేయడానికి కారణాలు ఏంటన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సమాజంలో మహిళలపై నేరాలు పెరుగుతున్న తరుణంలో, అర్ధరాత్రి మద్యం మత్తులో ఇలాంటి ప్రవర్తనతో రోడ్డు మీదకి రావడం ఏ సందేశాన్ని ఇస్తుందన్న ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి.