manabharath.com
Newspaper Banner
Date of Publish : 01 December 2025, 4:59 pm Editor : manabharath

సర్పంచ్ అభ్యర్థిగా దయానంద్ నామినేషన్

పొన్నారిలో బీఆర్ఎస్ ప్రభావం పెరుగుతోంది… సర్పంచ్ అభ్యర్థిగా దయానంద్ నామినేషన్

మన భారత్, తాంసి: తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల జోరు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున దర్శనాల దయానంద్ సర్పంచ్ అభ్యర్థిగా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు సందర్భంగా పార్టీ శ్రేణులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవడంతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.

దయానంద్ మాట్లాడుతూ… “పొన్నారి గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీర్చిదిద్దడం మా ప్రధాన లక్ష్యం. తాగునీరు, విద్యుత్, రహదారులు, చెరువులు– ప్రతి రంగంలో సమగ్ర అభివృద్ధి సాధించేందుకు శ్రమిస్తాం. గ్రామ ప్రజల మద్దతుతో శుభపాలన అందిస్తాం”* అని తెలిపారు.

అభ్యర్థితో పాటు మాజీ వైస్ ఎంపీపీ ముచ్చ రేఖ రఘు, మాజీ సర్పంచ్ అండె అశోక్, నాయకులు అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నామినేషన్ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు ఐక్యంగా ముందుకు రావడం, గ్రామంలో పార్టీ బలం పెరుగుతోందని సూచిస్తోంది.

పొన్నారిలో దయానంద్ రంగ ప్రవేశంతో ఎన్నికల సమరానికి కొత్త ఊపు లభించినట్లు స్థానిక రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.